అక్షరటుడే, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ శంకర్ గౌడ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ గెలుపు కోసం పని చేయాలని వారికి షబ్బీర్ అలీ సూచించారు.