అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దేవునిపల్లిలోని ఉన్నత పాఠశాలలో ఉదయం ప్రార్థన సమయంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మండలంలోని ఉగ్రవాయి పాఠశాలలను సందర్శించారు. విద్యార్థుల హాజరుపట్టిక పరిశీలించారు. అనంతరం మాచారెడ్డిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వైద్యుల హాజరు పట్టి తనిఖీ చేశారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, బీజేపీ నాయకులున్నారు.