అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి మౌలిక సదుపాయాల గురించి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడారు. రోగులు, ప్రజలు చెప్పిన సమస్యలను ఆస్పత్రి వైద్యులు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.