అక్షరటుడే, కామారెడ్డి: ప్రతి మండలంలో 100 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకునేలా చూడాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అధ్యక్షతన క్రియాశీల సభ్యత్వ కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గత రెండు నెలలుగా నిర్విరామంగా కొనసాగుతోందన్నారు. నేటి నుంచి జిల్లా స్థాయిలో క్రియాశీలక సభ్యత్వం చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రభారి ఆలే భాస్కర్ చేతుల మీదుగా ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు.