అక్షరటుడే, కామారెడ్డి : స్వదేశీ మేళా బ్రోచర్లను ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేశారు. హైదరాబాద్ పీపుల్స్‌ ప్లాజాలో అక్టోబర్‌ 23వ తేదీ నుంచి 27 వరకు మేళా జరుగనుంది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి రచ్చ శ్రీనివాస్‌, స్వదేశీ జాగరణ మంచ్‌ ప్రాంత ప్రచార ప్రముఖ్‌ కేశవ్‌ సోని, ఇందూర్‌ విభాగ్‌ కో-కన్వీనర్‌ రాజాగౌడ్‌, జిల్లా కన్వీనర్‌ రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.