అక్షరటుడే, కామారెడ్డి: మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా లేఅవుట్లు చేస్తే సహించేది లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన టీపీవో గిరిధర్ తో కలిసి కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లలో ఉన్న సౌకర్యాలు, రోడ్డు, డ్రెయినేజీ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణ పరిధిలో బృందావనం గార్డెన్స్ నుంచి లింగాపూర్ దేవునిపల్లి వరకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనక నుంచి కామారెడ్డి సబ్ స్టేషన్ వరకు ఉన్న లేఅవుట్లను పరిశీలించామన్నారు. దేవునిపల్లి పరిధిలో హైటెన్షన్ వైర్ల కింద 83 ఫీట్ల రోడ్డు తప్పనిసరిగా ఉండాలని, హైటెన్షన్ వైర్ల కింద రెండువైపులా 33 ఫీట్ల రోడ్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. లేఅవుట్లలో ఎలాంటి అవతవకలున్నా.. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rajampet mandal | బీఆర్​ఎస్​ నాయకుడు మోసగించాడని రోడ్డుపై మహిళ నిరసన