అక్షరటుడే, కామారెడ్డి: రానున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం చిన్న రాజులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పలువురు నాయకులు జిల్లా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర నాయకుడు మురళీధర్ గౌడ్, మాజీ మంత్రి నెరేళ్ల ఆంజనేయులు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు పోతంగల్ కిషన్ రావు, పైలా కృష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి: కేవీఆర్
Advertisement
Advertisement