అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి బల్దియాపై కాషాయ జెండా ఎగరాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో శనివారం పట్టణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం ప్రతి కార్యకర్త కంకణబద్దులై పని చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని.. వారికి అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. మున్సిపల్ లో ఒక్క స్థానం వదలకుండా 49 వార్డుల్లో బీజేపీ విజయం సాధించే విధంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.