అక్షరటుడే, కామారెడ్డి టౌన్: యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని యోగా భవన్ ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో యోగ సర్వరోగ నివారిణి అని అన్నారు. దేశ విదేశాల్లో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. అనంతరం యోగా సాధకులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యోగా భవన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు.