అక్షరటుడే, కామారెడ్డి: బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ ప్రతీక అని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ, వైస్ ఛైర్‌పర్సన్ వనిత, డీఎస్పీ నాగేశ్వరరావు, రూరల్ సీఐ రామన్ ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. చాకలి రాజయ్య, సంగయ్య, మల్లయ్య, గంగారం, భూపాల్, బీసీ సంక్షేమ శాఖ సంక్షేమ అధికారులు చక్రధర్, పవన్ పాల్గొన్నారు.