అక్షరటుడే, కామారెడ్డి : పట్టణంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఇందుప్రియ కోరారు. గురువారం ఇందుకు సంబంధించిన ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీ, రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేయాలనుకునేవారు 9492874006లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర ఛైర్మన్‌, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌, ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.