అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ సూచించారు. పట్టణ పరిధిలోని టేక్రియాలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆమె కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పౌష్టికాహారంతో రక్తహీనతను దూరం చేయొచ్చని తెలిపారు.