అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువును పరిశీలించారు. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద చెరువు నుంచి 30 శాతం నీటిని వినియోగించుకునేలా ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను కోరారు. ఆమె వెంట కమిషనర్ సుజాత, డీఈఈ సంతోష్, టీపీవో గిరిధర్, కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, తైబ సుల్తానా సలీం, మొయినుద్దీన్, ఆస్మా అంజద్, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.