అక్షరటుడే, కామారెడ్డి: కట్టుకున్న భార్యను స్నేహితుడితో కలిసి వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించింది. కాగా.. నిందితులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన మహిళకు తొమ్మిదేళ్ల కిందట రాజంపేటకు చెందిన రంగా గంగాధర్ గౌడ్ తో వివాహం కాగా.. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆపై భర్త గంగాధర్ గౌడ్ అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. అంతే కాకుండా వైజాగ్ కు చెందిన అతని స్నేహితుడు సతీశ్ ను ఇంట్లోనే ఉంచి ఇద్దరు కలిసి బాధితురాలిపై భౌతిక దాడికి పాల్పడేవాడు. దీంతో మహిళ ఈ నెల 6న ఆత్మహత్యకు పాల్పడగా.. చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ పేర్కొన్నారు.