రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై ప్రభుత్వం సీరియస్

0

అక్షరటుడే, కామారెడ్డి: జిల్లా ఆస్పత్రిలో రోగిని ఎలుకలు రోగిని ఎలుకలు కరిచిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. కాగా.. వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆదివారం జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలుకలు కరిచిన రోగి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తదుపరిగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రిలో మరమ్మతులు చేయిస్తామని కమిషనర్ తెలిపారు. రోగుల బంధువులు తిని పాడేసిన వ్యర్థాల వల్లే ఎలుకలు వస్తున్నట్లు గుర్తించారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.