అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy sp | ప్రతి వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర (Kamareddy sp rajesh chandra) సూచించారు. లేదంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు (cc cameras) ఏర్పాటు చేశామన్నారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూం అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు.
Kamareddy sp | వాహనదారులు హెల్మెట్ ధరించాలి
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వాహనాలపై ఉన్న పెండింగ్ ఈ- చలానాలను వెంటనే చెల్లించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు భిక్కనూరు నుంచి దగ్గి వరకు జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ (speed limit on national highway 44) 80కి తగ్గించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.