అక్షరటుడే, ఎల్లారెడ్డి : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్‌ను సోమవారం ఎస్పీ సింధుశర్మ సందర్శించారు. దిగువకు వెళ్తున్న వరద ఎక్కువగా ఉండడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు.