అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సింధు శర్మ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం సదాశివనగర్‌ పీఎస్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువయ్యేలా విధులు నిర్వహించాలని సూచించారు. గణేశ్‌ నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు పరిశీలించి సిబ్బంది పనితీరు, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సంతోష్‌ కుమార్, ఎస్సై రంజిత్, సిబ్బంది ఉన్నారు.