Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి విడుదలైన కొన్ని రోజులకే మళ్లీ దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి పట్టణ పోలీస్​ స్టేషన్​లో సీఐ చంద్రశేఖర్​ రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ చౌరస్తా సమీపంలో ఉన్న విజయ సూపర్ మార్కెట్​లో జనవరి 25న చోరీ జరిగింది. గోడకు రంధ్రం చేసి లోనికి చొరబడి దొంగతనం చేశారు. ఈ కేసులో మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామానికి చెందిన పాత నేరస్తులు లంబాడి దేవసోత్ రాజు, లంబాడి బుట్ట రాజును అరెస్ట్​ చేశారు. గతంలో వీరు పాపన్నపేట్, టేక్మాల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి జనవరిలో విడుదలయ్యారని సీఐ తెలిపారు. మళ్లీ కామారెడ్డి, తూప్రాన్​ పట్టణాల్లో దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని ఆయన వివరించారు. వారి నుంచి ఒక బైక్​, 2 ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించామని తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Excise Police | భారీగా నిషేధిత డ్రగ్స్​ పట్టివేత