అక్షరటుడే, కామారెడ్డి టౌన్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అవేర్నెస్, మాదకద్రవ్యాల వినియోగం, ట్రాఫిక్ రూల్స్ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కళాబృందం, షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సిబ్బంది, సైబర్ సెక్యూరిటీ సిబ్బంది, పట్టణ పోలీసులు పాల్గొన్నారు.