అక్షరటుడే, కామారెడ్డి: ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కామారెడ్డి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ సూచించారు. మంగళవారం పట్టణంలోని నాలుగో వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో మురికి కాల్వలు, రోడ్లపై పిచ్చి మొక్కలను తొలగించాలని మున్సిపల్‌ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, వార్డు కౌన్సిలర్‌, పిడుగు మమత సాయిబాబా, పాత శివ కఅష్ణమూర్తి, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.