అక్షరటుడే, ఆర్మూర్: కమ్మర్ పల్లిలో పేకాటకు ఏకంగా బాంకెట్ హాల్ అడ్డాగా మారింది. సోమవారం రాత్రి పోలీసులు ఈ స్థావరంపై దాడి చేయగా 35 మంది పట్టుబడ్డారు. ఎస్సై అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఓ హాల్ లో పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో సోమవారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో అక్కడ పేకాడుతున్న 35 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.2.38 లక్షల నగదు, 228 కాయిన్స్, 35 సెల్ ఫోన్లు నాలుగు కార్లు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. పేకాడుతున్న వారంతా మెట్ పల్లి, మంచిర్యాల, బాన్సువాడ, బోధన్ తదితర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.
బాంకెట్ హాల్ అడ్డాగా పేకాట.. 35 మంది అరెస్ట్
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement