అక్షరటుడే, వెబ్డెస్క్: High court | కంచ గచ్చిబౌలిలోని భూమి కేసుపై హైకోర్టు(High Court) విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. ఇక్కడ 400 ఎకరాల భూమిని చదును చేసి వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అది హెచ్సీయూ భూమి(HCU Land) అని విద్యార్థులు, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టులో దీనిపై పిటిషన్(Petition) దాఖలైన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్పై సోమవారం కోర్టు(Court) ఇరుపక్షాల వాదనలు విన్నది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి(Menaka Guruswamy) తన వాదన వినిపించారు.