అక్షరటుడే, హైదరాబాద్: Kancha Gachibowli : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం కమిటీని ఏర్పాటు చేసింది.
క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ(Empowered Committee of the Environment and Forest Departments,) ఛైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు నిన్న సాయంత్రం 7:45 గంటలకు చేరుకున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చేరుకోనుంది. కమిటీ సభ్యులు కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపడతారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం అవుతారు.