Kannappa | కన్నప్ప ట్రైలర్ ఎప్పుడో తెలుసా.. ప్రభాస్ ని బాగా వాడేసినట్టు టాక్..!

Kannappa | కన్నప్ప ట్రైలర్ ఎప్పుడో తెలుసా.. ప్రభాస్ ని బాగా వాడేసినట్టు టాక్..!
Kannappa | కన్నప్ప ట్రైలర్ ఎప్పుడో తెలుసా.. ప్రభాస్ ని బాగా వాడేసినట్టు టాక్..!
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kannappa | ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. అంతేకాదు సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ ఇలా అందరు భాగం అవుతున్నారు. సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారు. ఐతే రుద్ర పాత్రలో ప్రభాస్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. ఏప్రిల్ 25న కన్నప్ప రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఐతే కన్నప్ప ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 5న దుబాయ్ లో కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఉండబోతుందని తెలుస్తుంది. సాధ్యమైనంతవరకు అందులో నటించిన స్టార్స్ అంతా కూడా ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఉండేలా చూస్తున్నారట. ఐతే ఈ ట్రైలర్ లో మెయిన్ హైలెట్ గా ప్రభాస్ ని ఉంచుతున్నారని తెలుస్తుంది.

Kannappa | పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ మాస్ స్టామినా..

తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ మాస్ స్టామినా గురించి తెలిసిందే. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ప్రభాస్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎగ్జైట్ అవుతున్నారు. ఐతే రాజా సాబ్ తో సమ్మర్ లో ఫ్యాన్స్ ని అలరిస్తాడని అనుకున్న ప్రభాస్.. ఆ సినిమాకు టైం ఉందని కన్నప్పతో అలరించడానికి వస్తున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Nag Ashwin | కల్కి 2 కన్నా జాతిరత్నాలు సీక్వెల్ మీదే నాగ్ అశ్విన్ ఫోకస్.. ఎందుకలా..?

ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాలో నటించిన స్టార్స్ అందరినీ బాగా హ్యాండిల్ చేశాడని తెలుస్తుంది. కన్నప్ప మీద మంచు విష్ణు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి సినిమా ఆశించిన రేంజ్ లో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. మంచు విష్ణు కన్నప్ప సినిమా భక్త కప్ప కథతో వస్తుంది. ఐతే కన్నప్ప సినిమాను చేసే టైం లో మంచు విష్ణు చాలా ఫోకస్ తో పనిచేశారని తెలుస్తుంది. కన్నప్పలో స్టార్స్ అంతా నటించడం కూడా సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేసింది. ఐతే కన్నప్ప రిలీజ్ దగ్గర పడుతున్న ఈ టైం లో మేకర్స్ సినిమాను భారీగా ప్రమోట్ చేసి ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా చేయబోతున్నారు

Advertisement