అక్షరటుడే, వెబ్ డెస్క్: కపిల మహిళా సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు అందిస్తున్న టైలరింగ్ ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ అధ్యక్షురాలు గోపిక అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ లో సొసైటీ, ఉజ్ఞ సోషల్ వర్క్ ఫౌండేషన్ సౌజన్యంతో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సొసైటీ ఆధ్వర్యంలో 25 మంది మహిళలకు రెండు నెలల పాటు టైలరింగులో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టినట్లు ఉజ్జ(UGNA) అధ్యక్షుడు అమిత్ చౌదరి అన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement