అక్షరటుడే, ఇందూరు: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ వజ్రోత్సవాలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా నగరంలో రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మాజీ సైనికులు సాయిలు, కమలాకర్‌ను సత్కరించారు. అనంతరం రోటరీ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ మాట్లాడుతూ.. త్రివిధ దళాలు అంటే ఐక్యత, శౌర్యం, త్యాగం అన్నారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు కమల్‌ ఇన్నాని, గంగారెడ్డి, భరత్‌ పటేల్‌, బాబురావు, తులసీదాస్‌, జితేంద్ర మలాని, జ్ఞాన ప్రకాశ్‌, దర్శన్‌ సింగ్‌, శ్యాం అగర్వాల్‌, శ్రీనివాసరావు, గణేశ్‌ గుప్తా, అంకిత్‌ అగర్వాల్‌, జుగల్‌ సోనీ పాల్గొన్నారు.

బోధన్‌ పట్టణంలో..

అక్షరటుడే, బోధన్‌: భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా శుక్రవారం అమరవీరులకు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ వీరయ్య విద్యా వికాస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ రమేశ్‌, బీవీఎస్‌ ఉపాధ్యక్షుడు చిక్కం ప్రవీణ్‌, సాలూర మండలాధ్యక్షుడు సిద్ధార్థ్‌ పాల్గొన్నారు.