అక్షరటుడే, వెబ్‌డెస్క్ : కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా వెలిచాల రాజేందర్ రావు ఎన్నికయ్యారు. కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ, ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికపై క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.