అక్షరటుడే, వెడ్ డెస్క్: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పేయ్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ లోని తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఇంజినీర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రాచీన కట్టడాల నిర్మాణానికి ఇంజినీర్లు ఎంతో కృషి చేశారని తెలిపారు. రోజురోజుకు వస్తున్న మార్పులకు కనుగుణంగా ఇంజినీర్లు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. అనంతరం ఇంజినీర్లు, అధికారులను సన్మానించారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గంగాధర్, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు ముక్క శరత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మ్యాడం శివకాంత్, కోశాధికారి బట్టు వినోద్, పీడీజీలు చిదుర సురేష్, కొండా వేణుమూర్తి, ఆర్సీ కొండ రాంబాబు, ప్రోగ్రాం ఛైర్మన్ సాయినేని నరేందర్, పీఆర్వో ఎలగందుల రవీందర్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement