అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ‘ముడా స్కామ్‌’ పిటిషన్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కుంభకోణంలో తనపై విచారణకు అనుమతిస్తూ గవర్నర్‌ థావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆదేశాలను సీఎం హైకోర్టులో సవాలు చేశారు. కానీ మంగళవారం న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. స్కామ్‌పై విచారణ చేయాలని ఆదేశించేందుకు గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయని తీర్పులో వెల్లడించింది. మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) పరిధిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర రూ. 4వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోంది.