అక్షరటుడే, ఇందూరు: Mlc Kavitha | ఎమ్మెల్సీ కవిత కనీసం ఈ ఏడాదైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని బీజేపీ మాజీ కార్పొరేటర్ ప్రవళిక సూచించారు. గురువారం నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల కవిత పలు కుంభకోణాలపై మాట్లాడుతున్నారని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో వాటి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిసారి తమ ఉనికిని చాటుకోవడం కోసం జిల్లాకు వచ్చి ఎంపీ మీద మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారని ఆమె దుయ్యబట్టారు. పసుపు మీద కనీస అవగాహన లేకుండా ఆమె మాట్లాడుతోందన్నారు. స్వయంగా తమ దుకాణంలో ఉన్న పసుపుని చూపిస్తూ గతవారం రూ. 10వేల నుంచి రూ.13 వేల మద్దతు ధర పలికిందని చెప్పుకొచ్చారు. ధర్మపురి అర్వింద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు హేమలత, మమత, ఇందిరా, నాయకులు వనిత, సుమిత్ర, లత, జ్యోతి, రచన, తదితరులు పాల్గొన్నారు.