అక్షర టుడే, ఇందూరు: MLC Kavitha | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దాశరథి శత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘ఆ చల్లని సముద్ర గర్భం’ దృశ్యగీతం రూపొందించగా, శుక్రవారం ఆవిష్కరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్రప్రభుత్వం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోందన్నారు. కేసీఆర్ హయాంలో హరితహారంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నరుకుడు పాలన నడుస్తోందని విమర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం మరో ఉద్యమం నడుస్తోందని, దాశరథి స్ఫూర్తితో పోరాటాలు చేయాలన్నారు.