అక్షర టుడే, వెబ్ డెస్క్ Kavya Maran : సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. తొలి మ్యాచ్ ఒక్కటి మాత్రమే బాగా ఆడిన సన్ రైజర్స్.. ఆ తర్వాత నుంచి దారుణంగా ఫెయిల్ అవుతోంది.. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో (Gujarat Titans) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతో పరాజయం పాలైంది ఎస్ఆర్‌హెచ్(SRH). దీంతో హ్యాట్రిక్ విజయాలతో టైటాన్స్.. పాయింట్ల పట్టికలో టాప్-2లోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) (34 బంతుల్లో 31, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలవగా, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/17) ఐపీఎల్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ తో సత్తా చాటాడు.
Kavya Maran : ఏమైంది వీళ్లకి..
ఛేదనలో గుజరాత్ GT 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి మంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శుభమాన్ గిల్ (Shubhaman Gill) కెప్టెన్ ఇన్నింగ్స్ (43 బంతుల్లో 61 నాటౌట్, 9 ఫోర్లు)తో సత్తా చాటాడు. కీలకదశలో ఆకట్టుకునే ఇన్నింగ్స్ ను ఆడాడు. బౌలర్లలో మహ్మద్ షమీ (Mohammed Shami) (2/28)తో సత్తా చాటాడు. సిరాజ్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. సన్ రైజర్స్ బలానికి విరుద్ధంగా స్లో వికెట్‌ను ఈ మ్యాచ్ కు సిద్ధం చేయడంతో బ్యాటర్స్ ఇబ్బంది పడ్డారు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18), ఇషాన్ కిషన్ (17) వికెట్లను కోల్పోవడంతో ఓ దశలో 50/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ (27)తో కలిసి నితీశ్ కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో అనికేత్ వర్మ (Aniket Verma) (18), పాట్ కమిన్స్ (22 నాటౌట్) తో వేగంగా ఆడడంతో సన్ రైజర్స్ సవాలు విసరగలిగే స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ (Kavya Maran).. తమ బ్యాటర్ల వైఫల్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డగౌట్‌లో చాలా నిరాశగా కనిపించింది.ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్‌లు పేలవ షాట్లతో పెవిలియన్ చేరడంతో కావ్య మారన్ తీవ్ర అసహనానికి గురైంది. ‘మీకు ఏం అయింది..రా అయ్యా.. ఒక్కడైనా సరిగ్గా ఆడటం లేదు’ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. మ్యాచ్ ఆసాంతం తీవ్ర బాధలో కనిపించింది. కావ్యమారన్ రియాక్షన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.