KCR | తెలంగాణ భవన్​కు చేరుకున్న కేసీఆర్​

KCR | తెలంగాణ భవన్​కు చేరుకున్న కేసీఆర్​
KCR | తెలంగాణ భవన్​కు చేరుకున్న కేసీఆర్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలంగాణ భవన్​కు చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం బీఆర్​ఎస్​ ఎల్పీ సమావేశం జరగనుంది. దీని కోసం ఆయన ఎర్రవల్లి ఫామ్​ హౌస్​ నుంచి తెలంగాణ భవన్​కు చేరుకున్నారు.

KCR | రేపటి నుంచి బడ్జెట్​ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై బీఆర్​ఎస్​ ఎల్పీ మీటింగ్​లో చర్చించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్​ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, కాంగ్రెస్​ హామీలపై చర్చించనున్నారు.

KCR | అసెంబ్లీకి వెళ్లనున్న కేసీఆర్​

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కేసీఆర్​ ఫామ్​ హౌస్​కే పరిమితమయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు, తర్వాత మరోసారి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. దీంతో సీఎం రేవంత్​రెడ్డి సహా మంత్రులు చాలా సార్లు కేసీఆర్​ సభకు రావాలని కోరారు. అయితే ప్రస్తుతం జరిగే బడ్జెట్​ సమావేశాల్లో కేసీఆర్​ పాల్గొంటారని తెలిసింది. తాను యాక్టివ్​ అయి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చ‌ద‌వండి :  Budget Session | రాష్ట్రంలో ప్రజా పాలన : గవర్నర్​

KCR | స్థానిక ఎన్నికల వేళ..

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో మే, జూన్​ నెలల్లో ప్రభుత్వం ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ రెండు స్థానాలు గెలుచుకొని ఊపు మీద ఉంది. అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ నాయకులు యోచిస్తున్నారు.

KCR | భారీ సభకు ప్లాన్​

మరోవైపు కేసీఆర్​ ఫామ్​ హౌస్​కే పరిమితం కావడంతో గులాబీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం అలుముకుంది. దీంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపి పార్టీకి పూర్వ వైభవం తేవాలని కేసీఆర్​ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్​ సెషన్​లో పాల్గొనాలని నిర్ణయించారు. అంతేగాకుండా ఏప్రిల్​ 10న హైదరాబాద్​లో సమావేశం నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. ఏప్రిల్​ 27 బీఆర్​ఎస్​ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు.

Advertisement