అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | పదేళ్ల బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో మొత్తం కేసీఆర్ (KCR) అప్పులు, వివిధ సంస్థలకు పడ్డా బకాయిలు లెక్క వేస్తే రూ.8.29 లక్షల కోట్లుగా తేలిందని సీఎం రేవంత్‌రెడ్డి Revanth Reddy అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో Station Ghanpoor సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. స్వయం సహాయక సంఘాలకు ఏడు ఆర్టీసీ బస్సులు అందజేశారు. అనంతరం ఆయన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు.
CM Revanth Reddy | ఎయిర్‌పోర్టు తీసుకొచ్చాం
పార్లమెంట్ ఎన్నికల సమయంలో వరంగల్‌కు ఎయిర్‌పోర్టు(Airport) తీసుకొస్తానని మాట ఇచ్చానని.. ఇప్పుడు దానిని సాధించానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.6,500 కోట్ల నిధులతో వరంగల్ (Warangal) నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గానికి రూ.800 కోట్లు మంజూరు చేయించారన్నారు.
CM Revanth Reddy | ఆర్టీసీకి రూ.5వేల కోట్లు చెల్లించాం
ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేసిందని సీఎం రేవంత్ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.1.53 లక్షల కోట్లు అప్పు చెల్లించిందన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి ఇప్పటి వరకు రూ.5,005 కోట్లు అందజేశామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్య పరిష్కరించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
CM Revanth Reddy | ఆదాయం తగ్గింది
రాష్ట్ర ఆదాయం తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గత సంవత్సరం రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. అయితే నిధుల లేమితో రూ.70 వేల కోట్ల తక్కువతో బడ్జెట్ ముగుస్తుందన్నారు. అంటే రూ.2.21 లక్షల కోట్లు మాత్రమే ఖర్చే చేశామని ఆయన పేర్కొన్నారు.