MLC Kavitha | కేసీఆర్​ మంచోడు కావొచ్చు.. నేను కొంచం రౌడీ టైప్​: కవిత

MLC Kavitha | కేసీఆర్​ మంచోడు కావొచ్చు.. నేను కొంచం రౌడీ టైప్​: కవిత
MLC Kavitha | కేసీఆర్​ మంచోడు కావొచ్చు.. నేను కొంచం రౌడీ టైప్​: కవిత

అక్షరటుడే, బాన్సువాడ: MLC Kavitha | బీఆర్ఎస్ రజతోత్సవ సభకు BRS silver jubilee meeting వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని ఎమ్మెల్సీ కవిత MLC Kavitha అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను BRS workers వేధించే ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. ‘కేసీఆర్​ KCR మంచోడు కావచ్చు.. నేను కొంచం రౌడీ టైప్ rowdy type​’ అని వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్​ నాయకులను BRS leaders వేధిస్తున్న నాయకులైనా, అధికారులైనా.. వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో pink book రాసుకుంటామని పేర్కొన్నారు. కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదన్నారు.

Advertisement

వరంగల్​ రజతోత్సవ సభ Warangal silver jubilee meeting నేపథ్యంలో.. బాన్సువాడ పట్టణంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల BRS key workers సన్నాహక సమావేశంలో కవిత మాట్లాడారు. బాన్సువాడలో గులాబీ జెండా ఎగురవేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్​ను BRS మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని కవిత హెచ్చరించారు. రజతోత్సవ మహాసభకు ఇంటికొకరు చొప్పున తరలిరావాలని పిలుపునిచ్చారు.

MLC Kavitha | కాంగ్రెస్ అంటేనే మాట తప్పే పార్టీ

కాంగ్రెస్ Congress అంటేనే మాట తప్పే పార్టీ అని, ఇక్కడి నాయకులు డబ్బు కోసమే ఆ పార్టీలోకి వలస వెళ్లారని కవిత ధ్వజమెత్తారు. బాన్సువాడ నియోజకవర్గంలో Banswada constituency బీఆర్ఎస్ కార్యకర్తలు BRS workers ధైర్యంగా ఉండాలని, కార్యకర్తల జోలికి ఎవరొచ్చినా ఊరుకోనని హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదని, ప్రజలకు మంచి, అభివృద్ధి చేశామన్నారు. కొందరు పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలను భయపట్టిస్తే.. భయపడేది లేదని హెచ్చరించారు. 15 నెలల్లోనే ప్రభుత్వంపై government వ్యతిరేకత వచ్చిందని అన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MLC kavitha | షకీల్​ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha | త్వరలోనే బాన్సువాడలో ఉప ఎన్నిక

త్వరలోనే బాన్సువాడకు ఉప ఎన్నిక రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యేలు Former MLAs జీవన్​రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్​ వ్యాఖ్యానించారు. ఇందులో పోచారం ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. ఊసరవెల్లి రాజకీయాలలో ఆరితేరిన పోచారానికి బాన్సువాడ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్ పాలన KCR rule స్వర్ణయుగం golden era అయితే.. రేవంత్ రెడ్డి Revanth Reddy పాలన దరిద్ర పాలన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్, సాయిబాబా, మోచి గణేష్, రమేష్ యాదవ్, శివ సూరి, బోడ చందర్, గౌస్, చందు, మహేష్, ఆనంద్ గౌడ్, సాయిలు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement