అక్షరటుడే, హైదరాబాద్: KCR : భారాస అధినేత కేసీఆర్‌ను తాను ఎప్పుడూ కించపరచలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఆయనను కించపరచనని అన్నారు. కేసీఆర్ ఉద్యమం చేశారని గుర్తుచేశారు. 1969లో 360 మంది చనిపోయినా తెలంగాణ రాలేదన్నారు. బీజేపీ పాలనలో 3 రాష్ట్రాలు ఇచ్చారని.. కానీ, తెలంగాణను ఇవ్వలేదన్నారు. సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. రాజకీయంగా దెబ్బతిన్నా సోనియాగాంధీయే తెలంగాణ ఇచ్చారని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
Advertisement
Advertisement