అక్షరటుడే, ఆర్మూర్: mla prashanth reddy | కేసీఆర్ (kcr) పాలనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీ రామరక్ష అని బాల్కొండ(balkonda) ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్‌లో సోమవారం వివిధ పార్టీల నుంచి పలువురు బీఆర్ఎస్(brs)లో చేరారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్(congress) ప్రభుత్వం మోసపూరిత, కక్ష సాధింపు పాలన చేస్తుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.