అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth | ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్(KCR)కు ప్రతిపక్ష హోదా ఎందుకని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth REddy) ప్రశ్నించారు. స్టేషన్ ఘన్పూర్(Station Ghanpoor) సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఈ 15 నెలల కాలంలో రూ.58 లక్షల జీతం(Salary) తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా వందలాది మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇన్ని పొందుతున్నా కేసీఆర్ తన అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా ఫామ్‌హౌస్‌కు పరిమితం కావడం సరికాదన్నారు.
CM Revanth | వారిని ఉసిగొల్పుతున్నారు
ఓడిపోగానే వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన కేసీఆర్ ప్రతి విషయానికి తన కొడుకు, అల్లుడును ఉసిగొల్పుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏ పని చేయకుండా ఫామ్‌హౌస్‌లో పడుకొని కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన అనుభవాన్ని తెలంగాణ ప్రజల కోసం వినియోగించాలని సీఎం కోరారు.
CM Revanth | ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు
బీఆర్ఎస్ హయాంలో ప్రజల కోసం చేసింది ఏమి లేదని సీఎం అన్నారు. ఫామ్‌హౌస్(Farmhouse)లు కట్టుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ గజ్వేల్‌లో, కేటీఆర్(KTR) జన్వాడలో, హరీశ్‌రావు(Harish rao) మొయినాబాద్‌లో, కవిత(Kavitha) శంకర్పల్లి దగ్గర ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల మీద అప్పులు పెట్టిన కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు సంపాదించుకుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.