అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) ఛైర్మన్‌గా కేశ వేణు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి వేణుకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు తెలిసింది. నగరానికి చెందిన కేశ వేణు కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేత. ప్రస్తుతం పార్టీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.