
అక్షరటుడే, వెబ్‌డెస్క్: immigration policy | అమెరికా ప్రవాస విధానంలో US immigration policy కీలక మార్పులకు Key changes శ్రీకారం చుట్టింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ Donald Trump తీసుకంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలతో పాటు ప్రవాసీయులను సైతం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న వారిని ఇప్పటికే వారి సొంత దేశాలకు పంపించేస్తున్నారు.
తాజాగా ఆ దేశంలో చట్టబద్ధంగా నివాసముంటున్న వారిన విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్‌లో చట్టబద్ధంగా 30 రోజుల కన్నా ఎక్కువగా నివాసమంటున్న వారు, కార్మికులు, విద్యార్థులు ఎవరైనా సరే తమ వివరాలను సమర్పించాలని హోం ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. వారి గుర్తింపు పత్రాలను identification documents ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని ఆదేశించింది.
immigration policy | ఎవరైనా సరే వివరాలివ్వాల్సిందే..
అమెరికాలో United States అనుమతి ఉన్న వీసాలపై ఉన్న వారు ఎవరైనా సరే కచ్చితంగా వివరాలు సమర్పించాల్సి ఉంటుందని హోం ల్యాండ్ సెక్యూరిటీ Homeland Security డిపార్ట్‌మెంట్ తెలిపింది. “18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాసీలు తగిన ప్రతాలు ఎల్లప్పుడూ తీసుకెళ్లాలని పేర్కొంది. H-1B లేదా విద్యార్థి అనుమతి వంటి వీసాలపై అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వారికి కూడా ఈ నియమం వర్తిస్తుందని స్పష్టం చేసింది. వలసదారుల పిల్లలు కూడా 14 ఏళ్లు నిండిన వారంతా తిరిగి వివరాలు నమోదు చేసుకోవాలని, వేలిముద్రలను fingerprints సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.
immigration policy | అక్రమ వలసల నిరోధానికి..
తాజా చర్యలు అక్రమ వలసదారులను illegal immigrants గుర్తించేందుకు ఉపయోగపడుతాయని అధికారులు చెబుతున్నారు. 2022 నాటికి అమెరికాలో 2.20 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం అంచనా వేయగా, ప్యూ రీసెర్చ్ మాత్రం 7 లక్షలుగా ఉంటుందని పేర్కొంది. తాజా చర్యలో ఇప్పుడు వారి పరిస్థితి గందరగోళంగా మారనుంది.
.@PressSec: “All foreign nationals present in the United States longer than 30 days must register with the federal government. Failure to comply with this is a crime punishable by fines, imprisonment, or both… If not, you will be arrested, fined, deported, never to return to… pic.twitter.com/gIbQKpR4fC
— Rapid Response 47 (@RapidResponse47) April 11, 2025