అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iftar | ఆంధ్ర ప్రదేశ్‌లోని ముస్లిం సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్(Iftar) విందును బహిష్కరించనున్నట్లు ప్రకటించాయి. వక్ఫ్(Waqf) సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని ముస్లిం సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సభ్యులు మాట్లాడుతూ.. గురువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విజయవాడ(Vijayavada)లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 29న విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ నిరసన చేపడుతామన్నారు.