YTD | ప్రభుత్వం కీలక నిర్ణయం.. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు

YTD | ప్రభుత్వం కీలక నిర్ణయం.. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు
YTD | ప్రభుత్వం కీలక నిర్ణయం.. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YTD | యాదగిరి గుట్ట అభివృద్ధి కోసం బోర్డు(yadagiri gutta trust board) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ(minister Konda Surekha) తెలిపారు. మంగళవారం ఆమె అసెంబ్లీ (Assembly)లో మాట్లాడారు. గతంలో యాదగిరిగుట్టలో సరైన వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడేవారని.. తమ ప్రభుత్వం ప్రస్తుతం సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి(వైటీడీ) బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పాలకమండలిని నియమించి యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

YTD | 18 మంది సభ్యులతో..

వైటీడీ(YTD) బోర్డులో 18 మంది సభ్యులు ఉంటారని మంత్రి వెల్లడించారు. ఏడాదికి రూ.100 కోట్లు వచ్చే ఆలయాలకు బోర్డు ఏర్పాటు చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. బోర్డు పదవీకాలం రెండేళ్లు ఉంటుందన్నారు. ఈ బోర్డుకు ఐఏఎస్(IAS)​ స్థాయి అధికారిని ఈవో(EO)గా నియమిస్తామని స్పష్టం చేశారు. బోర్డు ఛైర్మన్, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవన్నారు. ఈ బోర్డు యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక, వేద విద్యా సంస్థలను స్థాపించవచ్చన్నారు. వైటీడీకి అవసరమైన నిధులు ప్రభుత్వం ద్వారానే కేటాయిస్తామని ఆమె తెలిపారు.

Advertisement