అక్షరటుడే, వెబ్డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ YS Jagan అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం అటాచ్ చేసింది. వీటి విలువ రూ.793 కోట్లు ఉంటుందని పేర్కొంది. కడప Kadapa జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను అప్పటి వైఎస్‌ఆర్ YSR ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ Dalmia Cementsకు లీజుకిచ్చింది.
ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని అప్పట్లో సీబీఐ CBI ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ విషయంలో జగన్ భారీగా అనుచిత లబ్ధి పొందినట్లు ఆరోపించింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ఈడీ తాజాగా ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.