Iran | ఇరాన్, అమెరికా మధ్య కీలక చర్చలు.. ముందడుగు వేసిన ఇరు దేశాలు

Iran | ఇరాన్, అమెరికా మధ్య కీలక చర్చలు.. ముందడుగు వేసిన ఇరు దేశాలు
Iran | ఇరాన్, అమెరికా మధ్య కీలక చర్చలు.. ముందడుగు వేసిన ఇరు దేశాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran | కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర వేస్తూ అమెరికా, ఇరాన్ US and Iran అణు చర్చల విషయంలో ముందడుగు వేశాయి. టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్న తరుణంలో రెండు దేశాల మధ్య చర్చలు జరుగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధులు ఒమన్ వేదికగా సమావేశమయ్యారు. ఒమన్ విదేశాంగశాఖ మంత్రి Oman Foreign Minister సమాక్షంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి క్లుప్తంగా చర్చలు జరిపారు.

Advertisement
Advertisement

తొలి విడత చర్చలు ముగిశాయని, వచ్చే వారం ఇరుపక్షాలు మరిన్ని చర్చలు నిర్వహించనున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా Iranian official media వెల్లడించింది. రెండు గంటలకు పైగా చర్చలు జరిగాయని తెలిపింది. పరోక్ష చర్చలు ప్రారంభమయ్యాయని ఇరాన్ విదేశాంగ శాఖ Iranian Foreign Ministry అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగేయి Esmail Baghei ధ్రువీకరించారు. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడమే అత్యంత ముఖ్యమని తెలిపారు.

Iran | దశాబ్దాలుగా నలుగుతున్న సమస్య..

ఇరాన్ అణు కార్యక్రమంపై nuclear program సర్వత్రా ఆందోళన నెలకొంది. అణ్వస్త్రాలను తయార build nuclear weapons చేసేందుకు టెహ్రాన్ ఎన్నో సంవత్సరాలుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే, ఆ ప్రయత్నాలను అమెరికా United States అడ్డుకుంటూ వస్తోంది. టెహ్రాన్​పై ఆంక్షలు విధించడంతో పాటు ఇజ్రాయెల్ వంటి దేశాల సహాయంతో ఇరాన్ అణు కార్యక్రమాలను దెబ్బ తీస్తోంది. ఈ క్రమంలో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెర దించుతూ రెండు దేశాలు తాజాగా చర్చలు ప్రారంభించాయి. ఒప్పందం కుదరకపోతే ఇరాన్ అణు కార్యక్రమాన్ని Iran’s nuclear program లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ US President Donald Trump పదేపదే హెచ్చరించారు. అదే జరిగితే ఎదురు దాడులకు ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ తెలిపారు. అయితే, చివరకు రెండు పక్షాలు ముందుకొచ్చి ముఖాముఖి చర్చలు ప్రారంభించాయి. అయితే, ప్రస్తుత చర్చలు ముందడుగుగా భావిస్తున్నప్పటికీ, రెండో దశ చర్చలే కీలకం కానున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Gold price | మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌.. ఆదివారం ఇలా భ‌గ్గుమంది ఏంటి?