అక్షరటుడే, వెబ్‌డెస్క్: Devara-2 : మార్చి 28న విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం.. 2023లో వచ్చిన ‘మ్యాడ్’కు సీక్వెల్ గా రూపొందింది. కళ్యాణ్ శంకర్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్(Fortune Four Cinemas), శ్రీకర స్టూడియోస్(Srikara Studios) బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ దేవర 2 గురించి ప్రస్తావించాడు.
దేవర చిత్రాన్ని ఆదరించినందుకు, మీ అందరీ భుజాల మీద మోసినందుకు అందరికీ ధన్యవాదాలని ఎన్టీఆర్ పేర్కొన్నారు. దేవర 2 లేదు అని అనుకుంటున్న వారందరికీ చెబుతున్నా.. దేవర 2 ఉంటుంది.. కచ్చితంగా ఉండి తీరుతుంది.. దేవర తర్వాత మధ్యలో ఒక చిన్న పాజ్ ఇచ్చాం.. ఎందుకంటే మధ్యలో ప్రశాంత్ నీల్ వచ్చాడు.. దేవర 2 ఉండదనే వార్తల్లో నిజం లేదు.. అని వివరించారు.
ఇక ఈవెంట్ దేవర ప్రీ రిలీజ్, సక్సెస్ ఈవెంట్ లాంటిదని మ్యాడ్ స్క్వేర్లో నటించిన రామ్ నితిన్ వెల్లడించారు. ఇదే జోష్ లో దేవర 2 అప్డేట్ ఇచ్చి ఫుల్ ఖుషీ చేశాడు యంగ్ టైగర్ అని అన్నారు.