Farmers | సాదా బైనామాల విషయంలో కీలక అప్​డేట్​

Farmers | సాదా బైనామాల విషయంలో కీలక అప్​డేట్​
Farmers | సాదా బైనామాల విషయంలో కీలక అప్​డేట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers | సాదా బైనామాల కోసం దరఖాస్తు చేసి ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. బీఆర్​ఎస్​ BRS హయాంలో సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తామని దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత వాటి గురించి ఎవరు పట్టించుకోలేదు. తాజాగా భూ భారతి Bhu Bharati పోర్టల్​ తీసుకొచ్చిన ప్రభుత్వం సాదా బైనామాలకు సైతం మోక్షం కల్గించాలని నిర్ణయించింది. గతంలో సాదాబైనామాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వ నిర్ణయించింది.

Advertisement

బీఆర్​ఎస్​ హయాంలో 12.10.2020 నుంచి 10.11.2020 మధ్య సాదా బైనామాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. అయితే 2014 జూన్​ 2 కంటే ముందు కొనుగోలు చేసి, రిజిస్టర్ కాని డాక్యుమెంట్ (సాదా బైనామాలు)తో12 ఏండ్లకు పైగా భూమిని అనుభవిస్తున్నవారు రెగ్యులరైజేషన్‌‌కు అర్హులని ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాల మేరకు ఆర్డీవో నోటీసులు జారీ చేసి దరఖాస్తుదారులు, భూమి విక్రయించిన వారి నుంచి అఫిడవిట్​ స్వీకరిస్తారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Kotagiri | సహకార సంఘానికి తాళం వేసి రైతుల నిరసన

అనంతరం పొరుగు రైతులు, గ్రామ పెద్దల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని అన్ని సక్రమంగా ఉంటే 90 రోజుల్లో రెగ్యులరైజేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. స్టాంప్ డ్యూటీ, రూ.100 పెనాల్టీ, రిజిస్ట్రేషన్ ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.

Advertisement