Blackmail | కిలేడి టీచర్.. విద్యార్థి తండ్రితో ఎఫైర్.. అతడిని బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షల్లో వసూలు

Blackmail | కిలేడి టీచర్..విద్యార్థి తండ్రితో ఎఫైర్..అతడిని బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో వసూలు
Blackmail | కిలేడి టీచర్..విద్యార్థి తండ్రితో ఎఫైర్..అతడిని బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో వసూలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Blackmail | ఇటీవల నేరాలు బాగా పెరిగిపోయాయి. దేశ ఐటీ రాజధాని బెంగళూరులో Bengaluru మరిన్ని వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ కిలేడి టీచర్ ఉదంతం బయటపడింది.

Advertisement
Advertisement

విద్యార్థి తండ్రితో ఎఫైర్ పెట్టుకుని, అతడినే బ్లాక్మెయిల్ Blackmail చేసి, లక్షల్లో వసూలు చేయడం తోపాటు టార్చర్ పెట్టింది. దీంతో తట్టుకోలేని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో సదరు కిలేడి బాగోతం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వెస్ట్ బెంగళూరు West Bengaluru ఏరియాలో ఉంటున్నాడు. తన పిల్లలను ఇంటికి దగ్గర్లోని ఓ ప్రీ ప్రైమరీ బడిలో pre-primary school జాయిన్ చేశాడు. పిల్లల కోసం స్కూల్ కు వచ్చి వెళ్లే క్రమంలో శ్రీదేవి రుడాగి(25) అనే మహిళా టీచర్ తో అతడికి పరిచయం ఏర్పడింది. ఇరువురు నెంబర్లు మార్చుకుని.. చాటింగ్, వీడియో కాల్స్ chat and video calls మాట్లాడేవారు. ఆ పరిచయం కాస్త చనువుగా మారి అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఇంత వరకు బానే ఉన్నా.. ఆ తర్వాతే శ్రీదేవి తనలోని అసలు కోణాన్ని బయటపెట్టింది. విద్యార్థి తండ్రితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు photos and videos తీసిపెట్టుకుంది. వాటిని అడ్డు పెట్టుకుని విద్యార్థి తండ్రిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. బాధితుడి నుంచి బలవంతంగా అడపదడపా రూ.4 లక్షలు వసూలు చేసింది. అంతటితో ఆగకుండా పెద్ద మొత్తంలో డిమాండ్ demand చేయసాగింది. గత జనవరిలో ఒకేసారి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. శ్రీదేవి వేధింపులు తట్టుకోలేక బాధితుడు తన కుటుంబాన్ని గుజరాత్ కు షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇందుకోసం పిల్లల టీసీలు కావాలని బడికి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న శ్రీదేవి మరో ఇద్దరితో కలిసి వెళ్లి అతడిని మరోసారి బెదిరించింది. ఈసారి ఏకంగా రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే ఇద్దరి రహస్య ఫొటోలు, వీడియోలను secret photos and videos అతని కుటుంబానికి పంపుతానని బెదిరించింది. దీంతో భయపడ్డ బాధితుడు 1.9 లక్షలు ఇచ్చేశాడు. మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని బ్రతిమిలాడుకున్నాడు.

కిలాడి టీచర్ school teacher శ్రీదేవి వేధింపులు మరింత తీవ్రం కావడంతో భరించలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కిలాడీ టీచర్ దుర్మార్గపు బాగోతాన్ని గుర్తించి, ఆమె ఆట కట్టించారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా (produced in court).. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

Advertisement