అక్షరటుడే, వెబ్‌డెస్క్: Killed Her Hubby : మొగుడిని పనికి పంపించింది. ప్రియుడితో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఆపై మృతదేహాన్ని పాడుబడిన బావిలో పడేసింది. బీహార్లోని భగవానపూర్ పోలీస్ స్టేషన్ పరిధి కర్హారి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నితేష్‌కుమార్(26), నేహా ఇరువురు భార్యాభర్తలు. నేహా కుమారి గత కొంత కాలంగా గ్రామంలోని విశాల్ కుమార్తో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఫిబ్రవరి 20న నితేష్‌కుమార్‌కు పనికి వెళ్లడం ఇష్టం లేకున్నా.. భార్య నేహా అతడిని బలవంతంగా పంపించింది.
కాగా.. నితేష్ సాయంత్రం ఇంటికి తిరిగిరాగా.. విశాల్ కుమార్తో నేహా అభ్యంతరకరమైన స్థితిలో ఉంది. భార్యను నిలదీయడంతో ప్రియుడితో కలిసి నితేష్‌ను గొంతు కోసి దారుణంగా హతమార్చింది. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని 150 మీటర్ల దూరంలో ఉన్న బావి వరకు ఈడ్చుకెళ్లి అందులో పడేశారు.
Killed Her Hubby : ఆత్మహత్య డ్రామా..
మరుసటి రోజు ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదంటూ.. నితేష్‌కుమార్ కోసం బంధువులతో కలిసి నేహా సైతం వెతకడం ప్రారంభించింది. తనను ఎవరూ అనుమానించకుండా.. అందరినీ తప్పుదారి పట్టించడానికి, భర్త తనను వదిలి వెళ్లిపోయాడని నేహా విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Killed Her Hubby : మొబైల్ సీడీఆర్ సాయంతో..
నితేష్ తండ్రి భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేహా మొబైల్ యొక్క CDR ను బయటకు తీసినప్పుడు, అదే గ్రామానికి చెందిన విశాల్ కుమార్తో ఉన్న ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దీంతో మొదట ఆ బాలుడిని పోలీసులు విచారించగా.. విశాల్ నోరు విప్పలేదు. ఆ తర్వాత పోలీసులు నేహను అదుపులోకి తీసుకుని గట్టిగా బెదిరిస్తే.. ఇద్దరం కలిసి నితేష్‌ను హత్య చేసి, మృతదేహాన్ని బావిలో పడేసినట్లు పోలీసులకు చెప్పింది. నిందితులను పోలీసులు అరెస్టు రిమాండుకు తరలించారు.