అక్షరటుడే, వెబ్డెస్క్: Kishan Reddy | హైదరాబాద్ నగరంలోని హెచ్‌సీయూలో 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) కోరారు.
ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)కి గురువారం లేఖ రాశారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గచ్చిబౌలి(Gachibowli)లోని 400 ఎకరాల భూములు వేలం వేస్తామని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ(Assembly)లో ప్రకటించారు.
ఆ భూములు రిజర్వ్ ఫారెస్ట్(Reserve Forest)కు చెందినవి కావని, కొందరు గుంట నక్కలు ఆ భూమిని ఆక్రమించుకోవాలని చూస్తే ప్రభుత్వం కాపాడిందన్నారు. ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఆ భూములకు వేలంపాట నిర్వహిస్తామని ప్రకటించారు.
కాగా ప్రభుత్వం భూముల అమ్మకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కిషన్‌రెడ్డి(Kishan Reddy) లేఖలో కోరారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్రెడ్డి(Revanth Reddy) వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.